మీ సేవ కేంద్రాల్లో డేటా క్రాష్.. ఆందోళనలో దరఖాస్తుదారులు

byసూర్య | Mon, Sep 23, 2024, 10:16 PM

తెలంగాణ వ్యాప్తంగా మీ సేవ కేంద్రాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గత మూడు వారాలుగా సర్వర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తటంతో పౌరసేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ధృవీకరణ పత్రాల డౌన్ లోడ్, జీహెచ్ఎంసీ, పురపాలక, రెవెన్యూ సేవలకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. క్యాస్ట్, ఇన్‌కం ధ్రువీకరణ పత్రాల కోసం అప్లయ్ చేసుకున్నవారికి దరఖాస్తు ఆమోదం పొందినట్లు మెసేజ్ వచ్చినా.. సర్వర్లో సమస్యతో సర్టిఫికెట్ మాత్రం డౌన్లోడ్ కావడం లేదు. దీంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.


హైదరాబాద్ మీసేవ స్టేట్ డేటా సెంటర్ (ఎస్డీఎస్)లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలిసింది. ఈ సాంకేతిక సమస్యలతో డేటా క్రాష్ అయినట్లు సమాచారం. డేటాను రిట్రీవ్ చేసేందుకు సాంకేతిక నిపుణులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ వ్యాప్తంగా 5,216 మీ సేవ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో 38 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 204 రకాల సేవలు ప్రజలకు అందిస్తున్నారు. ఆ సేవల్ని పొందాలంటే మీసేవ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


విద్యార్థుల కుల, ఆదాయ పత్రాలతో పాటు రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి ఈసీ పొందాలంటే మీసేవ కేంద్రాల్లో అందుకు సంబంధించిన దరఖాస్తు చేసుకోవాలి. ఎమ్మార్వో ఆఫీసులో మ్యానువల్గా అందించే తొమ్మిది రకాల సర్టిఫికెట్లను సైతం ఇటీవల మీసేవలో అందుబాటులోకి తెచ్చారు. అయితే సాంకేతిక సమస్యలతో ప్రజలకు ఆ సేవలు అందటం లేదు. జులై 10 నుంచి ఈ నెల 12వ తేదీ మధ్యలో చేసుకున్న దరఖాస్తులు సర్వర్ సమస్యతో కనిపించడం లేదు. దీంతో మళ్లీ డ్యాకుమెంట్స్ను అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాలని దరఖాస్తు దారులకు చెబుతున్నారు. మీ సేవ కేంద్రాల నిర్వహకరులు చెబుతున్న సమాధానంతో ప్రజలు ఆందోళనకు గరువుతున్నారు. మళ్లీ డాక్యుమెంట్లు ఎలా సమర్పిస్తామని ప్రశ్నిస్తున్నారు.


అధికారులు మాత్రం ఆందోళన అవసరం లేదని చెబుతున్నారు. డేటా రిట్రీవ్ చేస్తున్నామని.. త్వరలోనే అనని సర్దుకుంటాయని అంటున్నారు. అయితే గతంలోనూ మీ సేవలో అంతరాయం ఏర్పడినా.. 24 గంటల నుంచి 48 గంటలలోల్లోనే సమస్య పరిష్కారం అయ్యేదని నిర్వాహకులు చెబుతున్నారు. తొలిసారిగా 15 రోజులకుపైగా సర్వర్ డౌన్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ఆదాయం కోల్పోవటమే కాకుండా.. ప్రజల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.


Latest News
 

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు Mon, Sep 23, 2024, 10:19 PM
బీజేపీలోకి వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య..? కాషాయ పార్టీ టార్గెట్ అదే Mon, Sep 23, 2024, 10:18 PM
మీ సేవ కేంద్రాల్లో డేటా క్రాష్.. ఆందోళనలో దరఖాస్తుదారులు Mon, Sep 23, 2024, 10:16 PM
మూడ్రోజుల క్రితమే ఇంటి రిజిస్ట్రేషన్.. అంతలోనే కూల్చేసిన 'హైడ్రా' Mon, Sep 23, 2024, 10:14 PM
ప్రైవేట్‌ హాస్పిటల్‌లో దారుణం.. డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు Mon, Sep 23, 2024, 10:12 PM