ప్రైవేట్‌ హాస్పిటల్‌లో దారుణం.. డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు

byసూర్య | Mon, Sep 23, 2024, 10:12 PM

వైద్యులను భగవంతుడితో పోలుస్తూ 'వైద్యో నారాయణో హరి' అంటారు. ప్రాణాలను నిలబెట్టగలే శక్తి డాక్టర్ల చేతుల్లోనే ఉంటుంది. అందుకే ఆ వృత్తికి సమాజంలో ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. అయితే కొందరు ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లు కాసుల వేటలో పడి పవిత్రమైన వృత్తికి మచ్చ తెస్తున్నారు. మానవత్వం మరిచిపోయి ఆరోగ్య సమస్యలను అలుసుగా చేసుకుని.. రకరకాల పరీక్షల పేర్లతో భయాన్ని సృష్టిస్తూ హాస్పిటల్ గల్లా పెట్టెలను నింపుకుంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రి మొదలుకొని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రి వరకు కాసుల కక్కుర్తి మరిగిన వైద్యులు జనాలను పీడించుకుతింటున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో అయితే శవాలకు కూడా ట్రీట్‌మెంట్ చేసి డబ్బులు దండుకుంటున్నారు.


తాజాగా.. కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. డబ్బులు ఇవ్వలేదని రోగి గాయాలకు వేసిన కుట్లు విప్పేశారు. రోగితో వాగ్వాదం పెట్టుకొని అతడిని బయటకు గెంటేశారు. కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆదివారం (సెప్టెంబర్ 22) ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన శ్రీను అనే వ్యక్తి బైక్‌పై వెళుతూ ప్రమాదానికి గురయ్యాడు. బైక్ అదుపు తప్పటంతో కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో అతడి కాలికి గాయాలయ్యాయి. దీంతో వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్లాడు.


అక్కడ డాక్టర్ కన్సల్టేషన్‌ ఫీజు కింద రూ.300 ముందుగానే చెల్లించాడు. అనంతరం హాస్పిటల్ సిబ్బంది అతని గాయాలకు కుట్లు వేసి.. రూ.1000 బిల్లు వేశారు. అయితే బాధితుడి తన వద్ద ప్రస్తుతం డబ్బులేదని.. క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేస్తానని చెప్పాడు. అందుకు ఆసుపత్రి సిబ్బంది ఒప్పుకోలేదు. యూపీఐ పేమెంట్ల ద్వారా డబ్బు చెల్లించాలన్నారు. తన అకౌంట్‌లో డబ్బులు లేవని.. క్రెడిట్ కార్డు ద్వారా తీసుకోవాలని శ్రీను వారికి సూచించాడు. దీంతో హాస్పిటల్ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు లేకుండా ట్రీట్‌మెంట్‌కు ఎందుకు వచ్చావంటూ మండిపడ్డారు.


బాధితుడు శ్రీనుతో పాటుగా కూడా వచ్చిన స్నేహితులపైనా ఆసుపత్రి దాడికి పాల్పడ్డారు. ఆసుపత్రి నుంచి వారిని బయటకు గెంటేశారు. దీంతో ఆసుపత్రి వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరికి ఆసుపత్రి సిబ్బంది శ్రీను గాయాలకు వేసిన కుట్లు విప్పేసి బయటకు పంపించారు. హాస్పిటల్ సిబ్బంది తీరును నిరసిస్తూ.. బాధితుడు అక్కడే ఆందోళనకు దిగాడు. ఆసుపత్రి సిబ్బంది చర్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. అరగంట పాటు అక్కడే ఆందోళన చేసిన శ్రీను.. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి గాయాలకు ట్రీట్‌మెంట్ చేయించుకున్నాడు. ఈ ఘటనపై రోగి బంధువులతో పాటుగా స్థానికులు మండిపడుతున్నారు. గాయాలకు వేసిన కుట్లు ఎలా విప్పి పంపిస్తారని మండిపడుతున్నారు. కొంచమైనా మానవత్వం చూపించకూడదా? అని ప్రశ్నిస్తున్నారు.


Latest News
 

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు Mon, Sep 23, 2024, 10:19 PM
బీజేపీలోకి వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య..? కాషాయ పార్టీ టార్గెట్ అదే Mon, Sep 23, 2024, 10:18 PM
మీ సేవ కేంద్రాల్లో డేటా క్రాష్.. ఆందోళనలో దరఖాస్తుదారులు Mon, Sep 23, 2024, 10:16 PM
మూడ్రోజుల క్రితమే ఇంటి రిజిస్ట్రేషన్.. అంతలోనే కూల్చేసిన 'హైడ్రా' Mon, Sep 23, 2024, 10:14 PM
ప్రైవేట్‌ హాస్పిటల్‌లో దారుణం.. డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు Mon, Sep 23, 2024, 10:12 PM