కుటుంబ డిజిటల్ కార్డుల జారీకి కార్యాచరణ చేపట్టాలన్న సీఎం

byసూర్య | Mon, Sep 23, 2024, 09:50 PM

తెలంగాణలో కుటుంబ డిజిటల్ కార్డుల జారీకి కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కార్డుల జారీ కోసం రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గంలో ఒక పట్టణం, ఒక గ్రామంలో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని సూచించారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి‌తో కలిసి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో డిజిటల్ హెల్త్ కార్డులపై సమీక్ష నిర్వహించారు. డిజిటల్ కార్డులో కుటుంబ సభ్యులందరి హెల్త్ ప్రొఫైల్ పొందుపరిచి, దాని ద్వారానే ఆరోగ్య సేవలు అందించాలని సీఎం సూచించారు. అర్హులందరికీ కుటుంబ డిజిటల్ కార్డులు అందేలా చూడాలన్నారు. ఇందుకోసం జిల్లాల వారీగా ప్రత్యేక వ్యవస్థ ఉండాలన్నారు. రాజస్థాన్, హర్యానా, కర్ణాటకలలో ఉన్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు.వన్ స్టేట్... వన్ డిజిటల్ కార్డు విధానం ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. రేషన్, ఆరోగ్య సేవలతో పాటు సంక్షేమ పథకాలన్నీ ఒకే కార్డు ద్వారా అమలు చేసేలా ప్రణాళిక చేస్తోంది. కుటుంబ డిజిటల్ కార్డు ద్వారా తెలంగాణలో ఎక్కడైనా సంక్షేమ పథకాలు పొందేలా ప్రణాళికలు చేస్తోంది.


Latest News
 

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు Mon, Sep 23, 2024, 10:19 PM
బీజేపీలోకి వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య..? కాషాయ పార్టీ టార్గెట్ అదే Mon, Sep 23, 2024, 10:18 PM
మీ సేవ కేంద్రాల్లో డేటా క్రాష్.. ఆందోళనలో దరఖాస్తుదారులు Mon, Sep 23, 2024, 10:16 PM
మూడ్రోజుల క్రితమే ఇంటి రిజిస్ట్రేషన్.. అంతలోనే కూల్చేసిన 'హైడ్రా' Mon, Sep 23, 2024, 10:14 PM
ప్రైవేట్‌ హాస్పిటల్‌లో దారుణం.. డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు Mon, Sep 23, 2024, 10:12 PM