నగరంలో ఈదురుగాలులతో కూడిన వర్షం

byసూర్య | Mon, Sep 23, 2024, 07:39 PM

హైదరాబాద్‌ నగరంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. ముఖ్యంగా సోమవారం రాత్రి సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు.మియాపూర్, నిజాంపేట్, లింగంపల్లి, టోలీచౌకి, షేక్‌పేట్, మెహదీపట్నం, ఆసిఫ్ నగర్, కూకట్‌పల్లి, మాదాపూర్, కొండాపూర్, రాజేంద్రనగర్ ఏరియాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వివరించారు.అటు తెలంగాణలోని నాగర్‌కర్నూల్, వనపర్తి, నల్గొండ, నారాయణపేట, గద్వాల్, మెదక్, సంగారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి, రంగారెడ్డిలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. సోమవారం రాత్రి పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.ఐఎండీ హైదరాబాద్ ప్రకారం.. 24వ తేదీ.. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ్‌పేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.25వ తేదీన.. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే సమయంలో.. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.


26వ తేదీన.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.


Latest News
 

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు Mon, Sep 23, 2024, 10:19 PM
బీజేపీలోకి వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య..? కాషాయ పార్టీ టార్గెట్ అదే Mon, Sep 23, 2024, 10:18 PM
మీ సేవ కేంద్రాల్లో డేటా క్రాష్.. ఆందోళనలో దరఖాస్తుదారులు Mon, Sep 23, 2024, 10:16 PM
మూడ్రోజుల క్రితమే ఇంటి రిజిస్ట్రేషన్.. అంతలోనే కూల్చేసిన 'హైడ్రా' Mon, Sep 23, 2024, 10:14 PM
ప్రైవేట్‌ హాస్పిటల్‌లో దారుణం.. డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు Mon, Sep 23, 2024, 10:12 PM