నేను మీకు బిగ్ ఫ్యాన్ మేడం.. సీతక్కతో మహేష్ బాబు భార్య నమ్రత

byసూర్య | Mon, Sep 23, 2024, 07:38 PM

సాధారణంగా సినిమా వాళ్లకు ఫ్యాన్స్ ఉంటారు. తమ అభిమాన హీరో హీరోయిన్లను చూసినప్పుడు, కలిసినప్పుడు ఫొటోలు, సెల్పీలు తీసుకుని ఫ్యాన్ భాయ్/గర్ల్ మూమెంట్‌ను ఆస్వాదిస్తుంటారు. అయితే.. ఇప్పుడు రాజకీయ నేతలకు కూడా ఫ్యాన్స్ ఉంటారని.. అది కూడా సెలెబ్రిటీలే ఉంటారని తెలుస్తోంది. ఆ లిస్టులో సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత.. తెలంగాణ మంత్రి సీతక్కకు పెద్ద ఫ్యాన్ అంటా. ఆ విషయాన్ని స్వయంగా నమ్రతే.. తెలిపారు. వరద బాధితుల సహాయార్థం.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు 50 లక్షల విరాళం ప్రకటించిన మహేష్ బాబు.. ఆ చెక్కును సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి మరీ ఇచ్చారు. ఈ సందర్భంగా తన అభిమాన పొలిటికల్ లీడర్‌ను చూసిన నమ్రత.. ఆమెతో ఫొటో తీసుకుని మురిసిపోయారు.


Latest News
 

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు Mon, Sep 23, 2024, 10:19 PM
బీజేపీలోకి వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య..? కాషాయ పార్టీ టార్గెట్ అదే Mon, Sep 23, 2024, 10:18 PM
మీ సేవ కేంద్రాల్లో డేటా క్రాష్.. ఆందోళనలో దరఖాస్తుదారులు Mon, Sep 23, 2024, 10:16 PM
మూడ్రోజుల క్రితమే ఇంటి రిజిస్ట్రేషన్.. అంతలోనే కూల్చేసిన 'హైడ్రా' Mon, Sep 23, 2024, 10:14 PM
ప్రైవేట్‌ హాస్పిటల్‌లో దారుణం.. డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు Mon, Sep 23, 2024, 10:12 PM