సాగర్ కి చేరుకున్న బైకుల నిర్వాణ ర్యాలీ.. బుద్ధవనం సందర్శించిన 250 బైకు రైడర్లు

byసూర్య | Mon, Sep 23, 2024, 05:23 PM

తెలంగాణ టూరిజం , హైదరాబాద్ బైక్ రైడర్ల అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన బుద్ధవనం బైకుల నిర్వాణ ర్యాలీ ఆదివారం నాడు నాగార్జునసాగర్ బుద్ధ వనముకు చేరుకుంది . హైదరాబాదులో ఈ బైకుల నిర్వాణ ర్యాలీని తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు . అనంతరం టి జి టి డి సి చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి,  మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొని మంత్రులతో సహా సుమారు పది కిలోమీటర్లు ద్విచక్ర వాహనాలపై ప్రయాణించి బైక్ రైడర్లలో  ఉత్సాహాన్ని నింపారు .  విఖ్యాంత్ కత్రి ఆధ్వర్యంలో సాగర్ లోని బుద్ధవనం చేరుకున్న బైక్ రైడర్లకు టి జి టి డి సి మార్కెటింగ్ జనరల్ మేనేజర్ అంజిరెడ్డి , ట్రాన్స్పోర్ట్ ,వాటర్ ఫ్లూయిట్ జనరల్ మేనేజర్ ఇబ్రహీం , బుద్ధవనం డిజైన్ ఇన్చార్జ్ శ్యాంసుందర్రావులు ఘనంగా స్వాగతం పలికారు . తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ఒగ్గు కథ కళాకారులతో సాంప్రదాయ డప్పు వాయిద్యాలతో స్వాగతం పలకడం ఆకర్షణంగా నిలిచింది.
అనంతరం ఈ బృందం బుద్ధ వనములోని మహా స్తూపం చుట్టూ ఉన్న సర్కిళ్లను బైకులపై మూడుసార్లు పరిక్రమ లు నిర్వహించిన అనంతరం బుద్ధుని పాదాలు బుద్ధ చరితవనం, ధ్యానవనం, స్థూప వనాలను సందర్శించి మహాస్థూపం చుట్టూ పరిక్రమలు చేశారు . మహాస్తుపం అంతర్భాగంలోని ధ్యాన మందిరం వీక్షించి అబ్బురపడ్డారు . ఈ సందర్భంగా నిర్వాణ బైక్ ర్యాలీలో పాల్గొన్న వారికి తెలంగాణ టూరిజం అధికారులు ప్రశంసా పత్రాలు అందజేశారు.. ఆపైన విజయ విహార్ చేరుకున్న ఈ బైక్ రైడర్ల బృందానికి విజయ విహార్ మేనేజర్ కిరణ్ కుమార్, లాంచ్ యూనిట్ మేనేజర్ హరియా నాయక్ ఆధ్వర్యంలో మరోసారి ఒగ్గు కథ కళాకారుల నృత్యాలతో, వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు . ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్న వారికి నెల రోజులు పాటు తెలంగాణ టూరిజం హోటల్ లో ఎక్కడ రూములు బుక్ చేసుకున్న 30% డిస్కౌంట్ వచ్చేలా పాల్గొన్న వారందరికీ కూపన్సు అందజేశారు ..తరువాత తెలంగాణ టూరిజం లాంచిలో సాగర్ జలాశయంలో వివరించారు . 250 మంది బైక్ రైడర్లు ఆదివారం సాగర్ సందర్శించడంతో సాగర్లోని పర్యాటక ప్రదేశాలైన బుద్ధవనం ,విజయ విహార్, లాంచ్ స్టేషన్ లలో సందడి నెలకొంది.


Latest News
 

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు Mon, Sep 23, 2024, 10:19 PM
బీజేపీలోకి వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య..? కాషాయ పార్టీ టార్గెట్ అదే Mon, Sep 23, 2024, 10:18 PM
మీ సేవ కేంద్రాల్లో డేటా క్రాష్.. ఆందోళనలో దరఖాస్తుదారులు Mon, Sep 23, 2024, 10:16 PM
మూడ్రోజుల క్రితమే ఇంటి రిజిస్ట్రేషన్.. అంతలోనే కూల్చేసిన 'హైడ్రా' Mon, Sep 23, 2024, 10:14 PM
ప్రైవేట్‌ హాస్పిటల్‌లో దారుణం.. డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు Mon, Sep 23, 2024, 10:12 PM