వీ ఆర్ ఎస్ విజ్ఞాన జ్యోతి స్కూల్ లో సీబీ ఎస్ ఈ ఖో-ఖో టోర్నమెంట్స్

byసూర్య | Mon, Sep 23, 2024, 05:27 PM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి వీ ఆర్ ఎస్ విజ్ఞాన జ్యోతి స్కూల్ లో, 2024 సీబీ ఎస్ ఈ ఖో-ఖో టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడం గర్వంగా ఉందని వీ ఆర్ ఎస్ స్కూల్ డైరెక్టర్ కొడాలి విజయరాణి అన్నారు. అనంతరం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొనే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో 5,500 క్రీడాకారులు అండర్-14, అండర్-17, మరియు అండర్-19 (బాలురు & బాలికలు) విభాగాల్లో పోటీ పడతారని తెలిపారు. ఈ టోర్నమెంట్ 2024 సెప్టెంబర్ 22 నుండి 25 వరకు జరుగుతాయన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతితులుగా సైబరాబాద్‌ బాలానగర్ జోన్ అదనపు పోలీస్ డిప్యూటీ కమిషనర్ పి. సత్యనారాయణ, సైబరాబాద్ బాలానగర్ జోన్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్  జి. హనుమంతరావు మరియు ఆసియా ఖో-ఖో బంగారు పతక విజేత ప్రమోద్ థోరాట్ హాజరయ్యారు. అనంతరం 
ఆరంభ వేడుకలో జ్యోతి ప్రజ్వలన  కార్యక్రమాన్ని పి. సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ టోర్నమెంట్‌కు వీ ఆర్ ఎస్ స్కూల్ ఆతిథ్యం ఇవ్వడం గొప్ప విషయమని, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనడం క్రీడాస్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. ఉత్సాహభరితమైన మార్చ్ పాస్ట్, మరియు ఒలింపిక్ టార్చ్, కార్యక్రమాలు ఎన్‌సిసి స్టూడెంట్స్ విద్యార్థుల చేతుల మీదుగా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో వీ ఆర్ ఎస్ విజ్ఞాన జ్యోతి ట్రస్టీ సభ్యులు వల్లూరుపల్లి రాజా రామమోహన్ రావు, వల్లూరుపల్లి రాజశేఖర్, డాక్టర్ వల్లూరుపల్లి గీత, వల్లూరుపల్లి రాజ్‌ కుమార్ మరియు వల్లూరుపల్లి రమణ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణలో త్వరలోనే మరో కొత్త రాజకీయ పార్టీ Mon, Sep 23, 2024, 08:57 PM
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పలు ట్రైన్లు రద్దు Mon, Sep 23, 2024, 08:52 PM
'దేవర' టికెట్ల ధరలు భారీగా పెంపు.. అదనపు షోలకూ పర్మిషన్ Mon, Sep 23, 2024, 08:49 PM
కేఏ పాల్ పిటిషన్ ఎఫెక్ట్.. ఆ 10 మంది తెలంగాణ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు Mon, Sep 23, 2024, 07:52 PM
సీఎం రేవంత్ సోదరుడికి భారీ ఊరట.. దుర్గం చెరువు కూల్చివేతలపై హైకోర్టు స్టే Mon, Sep 23, 2024, 07:48 PM