'దేవర' టికెట్ల ధరలు భారీగా పెంపు.. అదనపు షోలకూ పర్మిషన్

byసూర్య | Mon, Sep 23, 2024, 08:49 PM

జూనియర్ ఎన్టీఆర్, జాన్వీకపూర్ జంటగా.. కొరటాల శివ డైరెక్షన్‌లో భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమా గ్రాండ్‌ రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో దేవర సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా మిడ్‌ నైట్‌ షోలకూ కూడా పర్మిషన్ ఇచ్చింది. రిలీజ్ రోజున దేవర ఆరు షోలు ఆడించుకునేందుకు థియేటర్లను రేవంత్ రెడ్డి సర్కార్ అనుమతి ఇచ్చారు. ఇక.. ఆ తర్వాత రోజు (సెప్టెంబర్ 28) నుంచి అక్టోబర్‌ 6 వరకు రోజుకు 5 షోలు ఆడించుకునేలా వెసులుబాటు కల్పించింది.


అయితే.. మిడ్ నైట్ షోలు ఆడించేందుకు 29 థియేటర్లకు అనుమతించింది రేవంత్ రెడ్డి సర్కార్. మరోవైపు.. తొలిరోజు టికెట్‌ ధరలను ఏకంగా రూ.100 పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఇక.. సింగిల్‌ స్క్రీన్‌లలో అయితే.. టికెట్‌పై రూ.25, మల్టీప్లెక్స్‌లలో రూ.50 పెంచుకునే అవకాశం కల్పించింది. దీంతో.. తెలంగాణలోని థియేటర్లకు దేవర కాసుల వర్షం కురిపించనుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా.. దేవర సినిమాకు కావాల్సినంత సౌలభ్యాన్ని కల్పించింది. టికెట్ రేట్లను భారీగా పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్సుల్లో గరిష్ఠంగా రూ.130, సింగిల్ స్క్రీన్లలో రూ.110 వరకు పెంచుకునేందుకు అనుమతి కల్పించింది. ఇక.. మిడ్ నైట్ షోలకు కూడా ఏపీ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. దీంతో.. రిలీజ్ రోజున ఆరు షోలు ఆడనున్నాయి. ఆ తర్వాత 5 షోలు ఆడించుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఈ పెంచిన రేట్లు, అదనపు షోలు 9 రోజుల పాటు కొనసాగించుకునేలా ఏపీ సర్కార్ వెసులు బాటు కల్పించింది. దీంతో.. అటు ఏపీలోనూ.. దేవర కలెక్షన్ల వర్షం కురిపించే అవకాశం ఉందన్న అంచనాలు ఏర్పడ్డాయి.


 కాగా.. ఎన్టీఆర్, జాన్వీకపూర్‌తో పాటు సైఫ్ అలీఖాన్ లాంటి భారీ తారాగణంతో దేవర పార్ట్-1 తెరకెక్కించి. ఆచార్య అట్టర్ ప్లాప్ తర్వాత.. కొరటాల శివ కూడా హిట్టు కొట్టాలన్న కసితో దేవర సినిమాను తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. మరోవైపు.. ఆర్ఆర్ఆర్ వరల్డ్ వైడ్ విక్టరీ సాధించిన తర్వాత.. విడులదవుతున్న చిత్రం కావటంతో ఎన్టీఆర్ కూడా అంతే స్థాయిలో కష్టపడినట్టు ట్రైలర్, టీజర్లు, పాటలు చూస్తుంటే అర్థమవుతోంది. మరి.. భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న దేవర పార్ట్-1 ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. రెండు తెలుగు రాష్ట్రాలు ఇస్తున్న భారీ వెసులుబాట్లు దేవరకు ఏమేర కలెక్షన్లు రాబడతాయో వేచిచూడాలి.


Latest News
 

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు Mon, Sep 23, 2024, 10:19 PM
బీజేపీలోకి వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య..? కాషాయ పార్టీ టార్గెట్ అదే Mon, Sep 23, 2024, 10:18 PM
మీ సేవ కేంద్రాల్లో డేటా క్రాష్.. ఆందోళనలో దరఖాస్తుదారులు Mon, Sep 23, 2024, 10:16 PM
మూడ్రోజుల క్రితమే ఇంటి రిజిస్ట్రేషన్.. అంతలోనే కూల్చేసిన 'హైడ్రా' Mon, Sep 23, 2024, 10:14 PM
ప్రైవేట్‌ హాస్పిటల్‌లో దారుణం.. డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు Mon, Sep 23, 2024, 10:12 PM