26 టైర్లు, 75 అడుగుల పొడవు,,, ఖైరతాబాద్ వినాయకుడి కోసం విజయవాడ నుంచి ట్రాలీ

byసూర్య | Mon, Sep 16, 2024, 07:00 PM

గణేష్ చతుర్థి సందర్భంగా 9 రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్న ఖైరతాబాద్ మహ గణేషుడు.. గంగమ్మ ఒడిని చేరేందుకు సిద్ధం అయ్యాడు. మంగళవారం ఉదయం నుంచి ఖైరతాబాద్ మహా గణపతి.. శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఇక ఇంతటి భారీ వినాయకుడి విగ్రహాన్ని ఖైరతాబాద్ నుంచి హుస్సేన్ సాగర్‌ వరకు తీసుకెళ్లేందుకు.. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మంగళవారం ఉదయం 6.30 గంటల వరకు పూజలు ముగించుకుని.. నిమజ్జనం కోసం మహాగణపతిని తరలించనున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. మధ్యాహ్నం 1.30 గంట‌లలోపు నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయనున్నట్లు తెలిపారు.


ఇక ఈ ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం కోసం ఎప్పటిలాగే విజయవాడ ఎస్టీసీ ట్రాన్ల్‌పోపోర్టుకు చెందిన భారీ ట్రాలీని తీసుకువచ్చారు. దీనికి 26 టైర్లు ఉండగా.. 75 అడుగుల పొడవు.. 11 అడుగుల వెడల్పు కలిగి ఉంది. ఇక ఈ ట్రాలీ ఏకంగా 100 టన్నుల బరువును మోయగలదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ డీఎస్-6 ట్రాయిలర్ వెహికల్ వరుసగా రెండోసారి ఖైరతాబాద్ మహాగణపతిని హుస్సేన్ సాగర్ ఒడికి తరలించనుంది. ఇక నాగర్ కర్నూలుకు చెందిన భాస్కర్ రెడ్డి.. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి ఉపయోగించే వాహనానికి డ్రైవర్‌గా 11వ సారి ఉండనున్నారు. ఇక ఈసారి ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన మహా వినాయకుడి బరువు 70 టన్నులు ఉంది. ఇక ఈ విగ్రహం వెడల్పు 28 అడుగులు ఉంది.


మరోవైపు.. ఖైరతాబాద్ మహాగణపతిని తరలించేందుకు ఆదివారం.. ట్రాలీపై వెల్డింగ్ పనులను అధికారులు ప్రారంభించారు. భారీ విగ్రహం కదలకుండా ఉండేందుకు ఐరన్ స్తంభాలతో కింద బేస్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ట్రాలీపై వెల్డింగ్ పనులు పూర్తి అయ్యాయి. సోమవారం అర్ధరాత్రి సమయంలో ట్రాలీపైకి ఖైరతాబాద్ మహాగణపతిని ఎక్కించనున్నారు. విగ్రహాన్ని పైకి ఎక్కించిన తర్వాత సపోర్టింగ్ వెల్డింగ్ పనులను చేయనున్నారు. ఈ వెల్డింగ్ పనులు పూర్తి కావడానికి 3 నుంచి 4 గంటల సమయం పట్టనుంది.


ఆ తర్వాత వివిధ రకాల పూలు, లైట్లతో ట్రాలీని అలంకరించనున్నారు. మంగళవారం ఉదయాన్నే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఇక మహాగణపతి పక్కన ప్రతిష్ఠించిన శివపార్వతులు, శ్రీనివాస కళ్యాణం, బాలరాముడు, రాహువు కేతువు విగ్రహాల కోసం హైదరాబాద్‌కు చెందిన మరో ట్రక్‌ను సిద్ధం చేశారు.


Latest News
 

పీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ Sat, Sep 21, 2024, 01:01 PM
కొండా లక్ష్మణ్‌ బాపూజీకి కేటీఆర్ నివాళి Sat, Sep 21, 2024, 12:29 PM
కామారెడ్డి జిల్లాలో ఓ విషాద ఘటన Sat, Sep 21, 2024, 12:00 PM
రాత్రి కుండపోత.. ఇవాళ భారీ వర్షాలు Sat, Sep 21, 2024, 11:43 AM
డిండి ఎత్తిపోతల పూర్తి చేయాలి Sat, Sep 21, 2024, 11:38 AM