కులగణనపై రాహుల్ గాంధీ కీలక ప్రతిపాదన చేశారన్న రేణుకా చౌదరి

byసూర్య | Mon, Sep 16, 2024, 05:44 PM

దేశంలో కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ కీలక ప్రతిపాదన చేశారని, కులగణన ఎందుకు చేపట్టాలన్న దానిపై ఆయన సమగ్ర వివరణ కూడా ఇచ్చారని తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మహిళా నేత రేణుకా చౌదరి అన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కులగణనపై ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతోందని మండిపడ్డారు. రేణుకా చౌదరి నేడు ఢిల్లీలో మాట్లాడుతూ, కులగణన ఎందుకు చేపట్టడంలేదో మోదీ సర్కారు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కులగణన చేపట్టకుండా మిమ్మల్ని నిరోధిస్తున్న అంశాలు ఏవి? అని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి తీరుతామని రేణుకా చౌదరి స్పష్టం చేశారు.


Latest News
 

ఈనెల 28న హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము Sat, Sep 21, 2024, 03:00 PM
పలు అంగన్వాడి సెంటర్లలో పోషణ మాసోత్సవవాలు Sat, Sep 21, 2024, 02:58 PM
గ్రామపంచాయతీలో నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం Sat, Sep 21, 2024, 02:41 PM
ఘనంగా పీఎం విశ్వకర్మ మొదటి వార్షికోత్సవ వేడుక Sat, Sep 21, 2024, 02:37 PM
పర్టీలైజర్ డీలర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించాలి Sat, Sep 21, 2024, 02:32 PM