ఘనంగా పీఎం విశ్వకర్మ మొదటి వార్షికోత్సవ వేడుక

byసూర్య | Sat, Sep 21, 2024, 02:37 PM

ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన మొదటి వార్షికోత్సవ వేడుకలను మెట్ పల్లిలోని  కార్యక్రమంలో భాగంగా కోదండ రామాలయం ఫంక్షన్ హాల్ లో శుక్రవారం నిర్వహించారు. నిర్వాహకులు స్క్రీన్ ఏర్పాటు చేయడం తో ప్రధాన మంత్రి ప్రశంగాన్ని నేరుగా వీక్షించారు. ప్రధాని లభిదారులను ఉద్దెశించి ప్రసంగించారు. మెట్పల్లి లోని విశ్వకర్మ శిక్షణ కేంద్రం ఎంపిక అవ్వడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. అనంతరం కార్యక్రమానికి పాల్గొన్న అధికారులు లబ్దిదారులకు పథకం విశిష్టత మరియు 18 రకాల చేతివృతులకు అందిస్తున్న శిక్షణ స్టైఫెండ్ టూల్ కిట్స్ బ్యాంకు నుండి అందిస్తున్న రుణాల గురించి వివరించారు.
అదేవిధంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.ఈకార్యక్రమంలో  జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ యాదగిరి ,రీజినల్ స్కిల్ డెవెలప్మెంట్ ఇస్టిట్యూట్ అసిస్టెంట్ డైరెక్టర్  ఉషేంద్ర రావు , లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ కుమార్ , యూనియన్ మేనేజర్ ఆశిష్ ,బాజపా నియోజకవర్గ కన్వీనర్ సుఖేందర్ గౌడ్, నరేందర్ రెడ్డి , మారాంపెల్లి శ్రీనివాస్, కెనరా బ్యాంకు మేనేజర్ అన్వేష్  , శిక్షణ కేంద్రం నిర్వాహకులు  యాసీన్ ,కో ఆర్డినేటర్ బిస్మిల్లా, మరియు సిబ్బంది పాల్గొన్నారు .


Latest News
 

గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమం Sat, Sep 21, 2024, 03:51 PM
రాహుల్ వ్యాఖ్యలపై నిరసన Sat, Sep 21, 2024, 03:47 PM
పేదలకు వరం సీఎం సహాయనిధి Sat, Sep 21, 2024, 03:42 PM
ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం Sat, Sep 21, 2024, 03:37 PM
దామ్రాజపల్లిలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన Sat, Sep 21, 2024, 03:34 PM