పీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్

byసూర్య | Sat, Sep 21, 2024, 01:01 PM

 ఇటీవల అసెంబ్లీ సెక్రటరీ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని పీఏసీ ఛైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే గాంధీ అధ్యక్షతన పీఏసీ తొలి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు, పీఏసీ సభ్యులు కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్, రేవూరి ప్రకాశ్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ హజరయ్యారు. అలాగే బీఆర్ఎస్ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, భానుప్రసాద్, సత్యవతి రాథోడ్, ఎల్ రమణ హాజరవ్వగా ఎంఐఎం నుంచి బలాల, బీజేపీ నుంచి పవార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పీఏసీ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. పీఏసీ ప్రతిపక్షాలకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అసెంబ్లీ నుంచి ఐదు పేర్లను ఇవ్వాలని బీఆర్ఎస్‌ను అడిగారు. దీంతో ఎమ్మెల్యే గంగుల, వేముల ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, ఎల్ రమణ, సత్యవతి పేర్లను ఇచ్చామన్నారు. కానీ లిస్టులో హరీష్ రావు పేరుకు బదులుగా అరెకపూడి గాంధీ పేరును చేర్చారని, ఇదే విషయంపై పీఏసీలో ప్రశ్నించగా ఎటువంటి సమాధానం ఇవ్వలేదని, పీఏసీ సమావేశంలో స్పీకర్ కు బదులుగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు.


Latest News
 

వరద బాధితులకు సహాయం అందించడం అభినందనీయం Sat, Sep 21, 2024, 03:24 PM
భూ వివాదంలో ఇరు వర్గాల దాడి... Sat, Sep 21, 2024, 03:21 PM
శుభప్రద్ పటేల్ ను అభినందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. Sat, Sep 21, 2024, 03:17 PM
హైదరాబాద్‌లో మరోసారి గంజాయి చాక్లెట్ల కలకలం Sat, Sep 21, 2024, 03:13 PM
బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు. Sat, Sep 21, 2024, 03:11 PM