భూ వివాదంలో ఇరు వర్గాల దాడి...

byసూర్య | Sat, Sep 21, 2024, 03:21 PM

భూ వివాదంలో బీఆర్ఎస్ నాయకుడు పేదలపై దాడి చేసిన సంఘటన ఖమ్మం రూరల్లో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం రూరల్ మండలం గుదిమళ్ల గ్రామంలో భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తోపులాట జరింగింది. బొల్లినేని పుల్లయ్య కుమారుడు బొల్లినేని వెంకటేశ్వర్లుకు గుదిమళ్ల గ్రామంలో సర్వే నెంబర్ 145లో 4 ఎకరాల 20 కుంటల భూమి ఉండగా అందులో  గుదిమళ్ల మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ నాయకుడు పేరం వెంకటేశ్వర్లు మామ పోతునూక వెంకటేశ్వర్లుకు 1 ఎకరం 31 కుంట భూమిని ఎకరం రూ. 27 లక్షల చొప్పున రెండేళ్ల క్రితం విక్రయించారు.
అప్పటి నుంచి వీరి మధ్య వివాదం నడుస్తుంది. అడ్వాన్స్గా రూ. లక్షలు కట్టిన తరువాత సాగర్ కెనాల్ విషయమై ఇద్దరికీ మధ్య వివాదం జరిగింది. అప్పటి నుంచి పోతునూక వెంకటేశ్వర్లు మిగిలిన డబ్బులు కట్టడం లేదు. వీరు భూమి అప్పపగించడం లేదు. ఎన్నిసార్లు అడిగినా కట్టపోవడంతో బొల్లినేని పుల్లయ్య కుమారుడు శుక్రవారం భూమి దున్నుకుంటుండగా పేరం వెంకటేశ్వర్లు తన మామ పోతునూక వెంకటేశ్వర్లు తమ అనుచరులతో  కలిసి పుల్లయ్య కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఇరువురు కొట్టుకోగా ఇరువైపులా వ్యక్తులకు గాయాలయ్యాయి. బొల్లినేని వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చడం సరికాదన్న ఆర్యవైశ్య మహాసభ Sat, Sep 21, 2024, 05:28 PM
గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమం Sat, Sep 21, 2024, 03:51 PM
రాహుల్ వ్యాఖ్యలపై నిరసన Sat, Sep 21, 2024, 03:47 PM
పేదలకు వరం సీఎం సహాయనిధి Sat, Sep 21, 2024, 03:42 PM
ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం Sat, Sep 21, 2024, 03:37 PM