byసూర్య | Fri, Jul 12, 2024, 05:52 PM
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఘటన స్థలానికి రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ మారుతి వెళ్ళి న్యాయం చేసేందుకు కృషి చేస్తామనడంతో నిరసన విరమించారు. 7రోజుల క్రితం ప్రేమ వ్యవహారంతో సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. చికిత్స పొందుతూ ప్రశాంత్ (22) శుక్రవారం మృతి చెందాడు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులకు బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.