byసూర్య | Fri, Jul 12, 2024, 05:50 PM
రాజంపేట మండలం గుండారం గ్రామంలో శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు వినయ్ మాట్లాడుతూ, వర్షాకాలం సీజన్ ప్రారంభమైనందున పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నీటి తొట్టిలలో ఉన్న నీటిని తొలగించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గుండారం సెక్రటరీ శ్రీనివాస్, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.