byసూర్య | Fri, Jul 12, 2024, 05:48 PM
బీసీ గణన తర్వాతే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సాప శివరాములు అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డిలోని ప్రకటించారన్నారు. అధికారంలోకి వచ్చాక బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ప్రతినిధులు మోహనాచారి, అజీజ్, రాజయ్య, లింగమయ్య, రాజు ఉన్నారు.