byసూర్య | Fri, Jul 12, 2024, 05:45 PM
ప్రతి తండాలో, గుడిలో భోగి బండారు చేసి వేప చెట్లు నాటాలని మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ చెప్పారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో గిరిజనుల గురువు రామారావు మహారాజ్ 89వ జయంతి ఉత్సవాల గోడప్రతులను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో లంబాడా హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నునవాత్ గణేష్ నాయక్, నౌసిలాల్ నాయక్, మోతిసింగ్ నాయక్, సత్తిపండు తదితరులు ఉన్నారు.