byసూర్య | Fri, Jul 12, 2024, 04:41 PM
సుదీర్ఘకాల నిరీక్షణకు తెరదించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా పండిత పరిషత్ ల ఆధ్వర్యంలో ఈ నెల 13న బాన్సువాడలో కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు అరుణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి గఫూర్ శిక్షక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సరస్వతి ఫంక్షన్ హాల్ లో ఉదయం 10 గంటలకు కార్యక్రమం జరగనుంది అన్నారు. భాషా పండితులు సభను విజయవంతం చేయాలని కోరారు.