byసూర్య | Fri, Jul 12, 2024, 04:39 PM
రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన కాసుల బాలరాజ్ శుక్రవారం హైదరాబాదులో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డీ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాల్ రాజ్ ను శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పిటిసి ప్రదీప్ పటేల్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.