byసూర్య | Mon, Jul 08, 2024, 03:17 PM
కరీంనగర్ నగరవాసులకు త్రాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అధికారులను ఆదేశించారు. డ్యాం వద్ద గల నగరపాలక సంస్థ ఫిల్టర్ బెడ్ మరియు మిషన్ భగీరథ, క్లోరినేషన్ ప్లాంటులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ డిఈ లచ్చిరెడ్డి, ఏఈ గట్టు స్వామి, ఫిల్టర్ బెడ్ సిబ్బంది అజయ్, తదితరులు పాల్గొన్నారు.