byసూర్య | Mon, Jul 08, 2024, 03:27 PM
పెద్ద బొంకూర్ రోడ్ నుండి ఆటో స్టాండ్ వరకు దాదాపు 800 మీటర్ గల ఈ రోడ్ పై నిత్యం వందలాది మంది రాకపోకలు జరుపుతున్నారు. చుట్టూ పది గ్రామాల ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లి రాత్రి వేళల్లో ఈ రోడ్ నుండి నడుచుకుంటూ వెళ్లాలంటే భయబ్రాంతులకు గురాౌతున్నారు. వీది లైట్ లు రోడ్ కి ఇరువైపులా ఏర్పాటు చేయాలని కలెక్టర్ కి సోమవారం మిట్టపల్లి శ్రీనివాస్, కలవెన రవి, సతీష్, రాజు వినతి పత్రం అందచేశారు.