byసూర్య | Mon, Jul 08, 2024, 03:16 PM
తిట్లు, ఆరోపణలు బంద్ చేద్దాం. అభివృద్దిపై ఫోకస్ పెడదామని హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతోనే అభివృద్ది సాధ్యమని, కేంద్రం పక్షాన సంపూర్ణ సహకారం అందించే బాధ్యత తీసుకుంటానని పేర్కొన్నారు. సిరిసిల్లలో మున్నూరుకాపు సంఘ కళ్యాణ మండపం అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఎన్నికలైపోయినయ్. ఇకపై ఒకరినొకరు తిట్టుకోవడం బంద్ చేద్దామని అన్నారు.