byసూర్య | Mon, Jul 08, 2024, 03:12 PM
కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలో గత 3 రోజులుగా జరుగుతున్న ఎంసెట్ మొదటి దశ ధ్రువపత్రాల పరిశీలన సోమవారం విజయవంతంగా ముగిసిందని కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ 3 రోజులలో 874 మంది విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలించి కన్ఫర్మేషన్ లెటర్ అందజేశారు. ఈ సందర్బంగా ఎంసెట్ ఎంట్రెన్స్ టెస్ట్ లో ఉత్తమ ర్యాంక్ సాధించిన విద్యార్థులను వైస్ ప్రిన్సిపాల్ కిష్టయ్య, ఇతర సిబ్బంది అభినందించారు.