byసూర్య | Mon, Jul 08, 2024, 02:32 PM
భిక్కనూరు మండలంలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యులు సాయిరెడ్డి అందించిన సేవలు ఎంతో ఆదర్శమని గ్రామానికి చెందిన పలు కుల సంఘాల ప్రతినిధులు అన్నారు. ఆదివారం ఆయనను గ్రామానికి చెందిన పలు కుల సంఘాల ఆధ్వర్యంలో సత్కరించారు. కుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, గ్రామ ఎంపీటీసీ సభ్యునిగా సాయిరెడ్డి ఐదు సంవత్సరాలు గ్రామ ప్రజలకు ఎన్నో సేవలు అందించారని చెప్పారు.