byసూర్య | Mon, Jul 08, 2024, 02:35 PM
భిక్కనూరు మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గ్రామదేవతలకు బోనాలను ఊరేగించారు. ఆషాడమాసాన్ని పురస్కరించుకొని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బోనాలను అలంకరించారు. అనంతరం పట్టణంలోని ప్రధాన వీధుల గుండా బోనాలను ఊరేగించారు. పట్టణ ప్రజలు కనులారా తిలకించారు. అనంతరం గ్రామదేవతలకు బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని గ్రామదేవతలను వేడుకున్నారు.