byసూర్య | Wed, Jun 26, 2024, 03:42 PM
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలో విజయ డైరీకి పాలు పోసే రైతులు బుధవారం రోడ్డుపైన పాలు పారబోసి నిరసన వ్యక్తం చేశారు. గడిచిన నాలుగు నెలలుగా పాల బిల్లులు రావడంలేదని, పశువుల పోషణ కష్టంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పాలు అమ్ముకొని జీవనం సాగించే తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే పెండింగ్ పాల బిల్లులను విడుదల చేయాలని కోరారు.