byసూర్య | Wed, Jun 26, 2024, 03:40 PM
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని ఆర్టీసీ బస్టాండ్ చౌరస్తాలో నేషనల్ హైవే-44 ఫ్లై ఓవర్ పై బుధవారం గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు శవాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని, తెల్ల షర్టు ధరించి ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.