'హరీష్ రావూ.. రాజీనామా లేఖ రెడీ చేసుకో'.. రుణమాఫీ అమలు నేపథ్యంలో కాంగ్రెస్ నేతల సెటైర్లు

byసూర్య | Sat, Jun 22, 2024, 07:26 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. రైతులకు పంట రుణమాఫీని అమలు చేసేందుకు సిద్ధమైంది. రూ. 2 లక్షల మేరకు రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రుణమాఫీ ప్రక్రియను.. ఆగస్టు 15 తేదీ లోపల పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే.. ఈ ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది.. విధివిధానాలేంటీ.. లాంటి అంశాలపై ఇంకా క్లారిటీ రాకపోయినప్పటికీ.. నెట్టింట కాంగ్రెస్ శ్రేణులు హల్చల్ చేస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావును రాజీనామా లేఖ సిద్ధం చేసుకోవాలంటూ సెటైర్లు వేస్తున్నారు.


పార్లమెంట్ ఎన్నికల సమయంలో.. రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డికి, హరీశ్ రావుకు మధ్య సవాళ్ల పర్వం నడిచిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేసి తీరతామని రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేయగా.. అలా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదని, ఒకవేళ చేస్తే తాను తన పదవిని రాజీనామా చేస్తానంటూ హరీష్ రావు సవాల్ విసిరారు. ఈమేరకు ఓ రాజీనామా పత్రంలో అమరవీరుల స్థూపం వద్దకు వచ్చారు కూడా. కట్ చేస్తే.. ఇప్పుడు రుణమాఫీ అమలుకు మంత్రివర్గ ఆమోదం తెలపగా.. ఇక అమలే తరువాయిగా మారింది.


ఈ క్రమంలో.. రాజీనామా లేఖ సిద్ధం చేసుకోవాలంటూ హరీశ్ రావును కాంగ్రెస్ నేతలు ఆడేసుకుంటున్నారు. అటు నెట్టింటే కాదు.. కాంగ్రెస్ నాయకులు కూడా ప్రారంభించేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా హరీష్ రావును రాజీనామా లేఖ సిద్ధం చేసుకోవాలంటూ ఎద్దేవా చేశారు. ఆగస్టు 15 లోపు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలన్న మంత్రివర్గ నిర్ణయంపై రైతుల పక్షాన సీఎం రేవంత్ రెడ్డికి కృతఙ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా ప్రతి మండలంలో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు నిర్వహించాలన్నారు. కేటీఆర్, హరీశ్ రాజీనామా పత్రం పట్టుకుని సిద్ధంగా ఉండాలన్నారు జీవన్ రెడ్డి.


Latest News
 

ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా ఇంజినీరింగ్ ప్రొఫెసర్లు.. నాలుగేళ్లలో సీన్ రివర్స్, ఎంత కష్టమెుచ్చింది Wed, Oct 30, 2024, 11:01 PM
తెలంగాణలో నేటి వాతావరణం.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, పెరుగుతున్న చలి తీవ్రత Wed, Oct 30, 2024, 10:55 PM
తెలంగాణలో మయోనైజ్‌ నిషేధం.. రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం Wed, Oct 30, 2024, 10:50 PM
మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై నిషేధం విధించిన ప్రభుత్వం Wed, Oct 30, 2024, 10:49 PM
తెలంగాణలో వాళ్లందరికీ రేవంత్ సర్కార్ దీపావళి కానుక.. రేపే అకౌంట్లలోకి డబ్బులు Wed, Oct 30, 2024, 10:45 PM