byసూర్య | Fri, Jun 21, 2024, 09:13 AM
తెలంగాణలోని కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. అల్వాల్‌లోని ఆమె ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె మృతదేహన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనారోగ్య సమస్యలతోనే రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. తీవ్ర కడుపునొప్పి సమస్యతో రూపాదేవి కొంతకాలంగా బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు రోజులుగా స్కూల్‌కు సెలవు తీసుకుని ఇంట్లోనే ఉన్నారు. రూపాదేవి కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు.