byసూర్య | Thu, Jun 20, 2024, 03:18 PM
కొల్లాపూర్ లో అమానవీయ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. మొలచింతపల్లిలో ఈశ్వరమ్మ, ఈరన్న దంపతుల మధ్య గొడవ జరగగా భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భర్త ఆమె కోసం వాకబు చేశాడు. అయితే వీరి పొలం కౌలుకు తీసుకున్న వ్యక్తి ఆమెను తీసుకొచ్చి బంధించినట్లు తెలిసింది. ఆమెను వివస్త్రను చేసి మరీ శరీరంపై వాతలుపెట్టి పచ్చికారం పూశారు. ఈ సంఘటనపై కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు కొల్లాపూర్ ఎస్ఐ తెలిపారు.