byసూర్య | Thu, Jun 20, 2024, 03:15 PM
గోదావరిఖని విట్టల్ నగర్ కు చెందిన లక్ష్మికాంత(85) మృతి చెందిన ఆమె చూపు మాత్రం సజీవంగానే ఉంది. గురువారం కుటుంబ సభ్యులు మ్యాజిక్ హరి, కిష్టయ్య తల్లి నేత్రాలను దానం చేశారు. టెక్నీషియన్ ఆరిఫ్ సహకారంతో నేత్రాలను వాసన్ ఐ బ్యాంక్ హైదరాబాద్ కు తరలించారు. నేత్రదానంపై అవగాహన కల్పించిన మ్యాజిక్ రాజా, చంద్రపాల్, కుటుంబ సభ్యులను సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు అభినందించారు.