byసూర్య | Thu, Jun 20, 2024, 03:11 PM
ఏడాది నుంచి 19 ఏండ్లలోపు వయసు పిల్లలు, విద్యార్థులందరికీ అల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం చందుర్తిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అల్బెండజోల్ మాత్రలు అందజేశారు. ఆనంతరం స్కూల్ లోని తరగతి గదులను, వంటగదిలో మెనూ పరిశీలించారు.