byసూర్య | Thu, Jun 20, 2024, 03:09 PM
పోచారం ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరకు రైతుల పంట పొలాలకు సాగునీరు అందించాలని ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం ఎమ్యెల్యే క్యాంపు ఆఫీసులో డివిజన్ స్థాయి పంచాయితీ రాజ్, నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం తరపు నుండి రావాల్సిన నిధులు పెండింగ్ ప్రాజెక్టుల వంటి అంశాల పై సుదీర్ఘంగా చర్చించారు.