byసూర్య | Thu, Jun 20, 2024, 03:07 PM
ఎల్లారెడ్డిలోని శ్రీశ్రీశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో చోరీకి పాల్పడిన కేసులో నిందితున్ని పట్టుకున్నట్లు ఎస్ఐ. బొజ్జ మహేష్ తెలిపారు. గురువారం ఎస్ఐ. మాట్లాడుతూ.. ఆలయంలోని సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. లింగంపేట్ మండలం ఎక్కపల్లి తండా వాసి అయిన నిందితుడు ఎమ్. గణేష్ ను పట్టుకున్నట్లు చెప్పారు. ఇతను గతంలో సోలార్ ప్లేట్లు, విద్యుత్ తీగలు, ఆలయాల్లో దోపిడీలు చేసాడన్నారు.