byసూర్య | Sat, Jun 15, 2024, 03:24 PM
లింగంపేట్ తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గోపాల్ ని సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు లింగమయ్య, ఎల్లారెడ్డి పట్టణ అధ్యక్షులు అయ్యవారు మధుసూదన్ ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రిన్సిపాల్ ను శాలువా కప్పి వారు సత్కరించి, సమాచార హక్కు చట్టం బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కోరారు.