byసూర్య | Sat, Jun 15, 2024, 03:28 PM
ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్న ఐదు స్కూల్ బస్సులను సీజ్ చేసినట్లు జిల్లా ఇన్చార్జి రవాణాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. వాహనాల ఫిట్నెస్, ఇతర ధ్రువపత్రాలు పరిశీలించడం జరిగిందన్నారు. వాటిలో సరైన ధ్రువపత్రాలు, ఫిట్నెస్ లేకుండా నడుపుతున్న ఐదు పాఠశాల బస్సులను సీజ్ చేశామన్నారు.