byసూర్య | Sat, Jun 15, 2024, 03:22 PM
వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్ ఎండి సలీం, వైద్య అధికారి డాక్టర్ నరసింహారావు ప్రజలకు సూచించారు. శనివారం అంబేద్కర్ కూడలిలో గల అర్బన్ హెల్త్ సెంటర్ లో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.