byసూర్య | Sat, Jun 15, 2024, 03:20 PM
మగపిల్లలు పుట్టలేదని, పుట్టిన ఒక కుమార్తె అనారోగ్యంతో మృతి చెందిందని మనస్తాపానికి గురై వివాహిత సూసైడ్ చేసుకున్న ఘటన జడ్చర్ల మండలంలో జరిగింది. ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాలు.. భూత్పూర్ మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన అపర్ణకు ఆలూరుకు చెందిన మైబుతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలున్నారు. ఈనెల 13న భర్త మేస్త్రీ పనికి వెళ్లగా ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.