byసూర్య | Sat, Jun 15, 2024, 03:19 PM
వనపర్తి జిల్లాలో సామాజిక కార్యకర్త పోచ రవీందర్ రెడ్డిని రక్తదాన దినోత్సవం సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు, వనపర్తి మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రావుల మాట్లాడుతూ. 82 సార్లు రక్తదానం చేసి ఎంతోమంది ప్రజల ప్రాణాలను కాపాడారని అభినందించారు. ఈ స్ఫూర్తితో యువత ముందుకు రావాలన్నారు. నాయకులు నందిమల్ల అశోక్, అమరేందర్, బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.