byసూర్య | Sat, Jun 15, 2024, 03:17 PM
రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటేందుకు పార్టీ బలోపేతంపై శ్రేణులు దృష్టి సారించాలని బిఆర్ఎస్ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై వనపర్తి పార్టీ ఆఫీసులో నిర్వహించిన సమీక్షలో రావుల పాల్గొని మాట్లాడారు. మాజీమంత్రి నిరంజన్ రెడ్డి గత ఐదేళ్లు అభివృద్ధిపై దృష్టి కేంద్రకరించడంతో పార్టీ కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవమని అన్నారు.