byసూర్య | Sat, Jun 15, 2024, 03:13 PM
నారాయణపేట్ జిల్లా ఉట్కూర్లో వ్యక్తిని కొట్టి చంపిన ఘటనకు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం తీవ్రంగా పరిగణించారు. నిందితులపై కఠిన శిక్ష పడేలా చూడాలని డీజీపీ రవిగుప్తాను ఆదేశించారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. శాంతిభద్రతలను కాపాడడంలో విఫలమవడంతో ఉట్కూర్ ఎస్సైని జిల్లా ఎస్పీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.