byసూర్య | Sat, Jun 15, 2024, 03:07 PM
వనపర్తి జిల్లాలో హరితహారం కార్యక్రమానికి సంబందించి జూన్ నెలాఖరులోగా ప్లాంటేషన్ కోసం గుంతలు తీసే పనులు పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందితో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగేంద్ర, జడ్పీ సీఈఓ యాదయ్య, జిల్లా పంచాయతీ అధికారి రమణ మూర్తి, ఎంపీడీఓ, ఎపిఓ పాల్గొన్నారు.