ఫ్రీ బస్సు పథకం భారమంతా మా మీదనే పడుతుంది.. రైతు కామెంట్లు వైరల్

byసూర్య | Sat, Apr 27, 2024, 07:21 PM

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావుడి నెలకొంది. నేతలంతా క్షేత్రస్థాయిలోకి వెళ్తూ ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే.. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గురించి, అమలు చేస్తున్న కొత్త పథకాల గురించి ఏమంటుకుంటున్నారన్నది కొంత మంది తెలుసుకుని.. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పెడుతున్నారు. అయితే.. అందులో ఓ రైతు వ్యక్తం చేస్తున్న అసహనానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఓ అన్నదాత.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకం గురించి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిపై తనకున్న అసహనాన్ని వ్యక్తం చేశారు.


తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో జీరో టికెట్ ఇస్తున్నారు. అయితే.. ఈ పథకం కింది ప్రతి రోజు సుమారు 30 లక్షలకు పైగా మహిళా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే.. ఈ జీరో టికెట్‌కు సంబంధించిన భారం ప్రభుత్వమే భరించనుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో నాగర్‌కర్నూల్‌కు చెందని ఓ రైతును.. మాజీ సీఎం కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి రిపోర్టర్ అడిగాడు.


 కాళేశ్వరం ప్రాజెక్టు కింద లక్ష కోట్లు అవినీతి చేసి కేసీఆర్ తిన్నాడు.. ఆయనను జైలుకు పంపిస్తామని రేవంత్ రెడ్డి అంటున్నాడు మీరేమంటారు అంటూ ప్రశ్నించగా.. దానికి రైతు సమాధానం ఇచ్చాడు. ఫ్రీ బస్సు పథకం ద్వారా ఎన్ని కోట్లు నష్టమవుతోందని ప్రశ్నించారు. ఈ ఫ్రీ పథకానికి సంబంధించి డబ్బులు ఎక్కడి నుంచి నింపుతారని.. ఆ భారమంతా తిరిగి రైతుల మీదనే పడుతుందని ఆ రైతు తీవ్ర అహనం వ్యక్తం చేశాడు. మరోవైపు.. కేసీఆర్‌ను జైలులో పెట్టటం సీఎం రేవంత్ రెడ్డి వల్ల కాదని రైతు అన్నాడు. కిందా మీద తలపెట్టి తపస్సు చేసినా కేసీఆర్‌ను జైలులోకి పంపలేదని చెప్పుకొచ్చాడు. కేసీఆర్ తప్పు చేయలేదని.. జైలుకు వెళ్లడని దీమా వ్యక్తం చేశాడు. కాగా.. ఈ రైతు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.



Latest News
 

కవితే సూత్రధారి, పాత్రధారి.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ఛార్జిషీట్ Fri, May 10, 2024, 10:33 PM
అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన 'వండర్‌లా'.. ఆ 3 రోజులపాటు వాళ్లందరికీ డిస్కౌంట్ Fri, May 10, 2024, 09:08 PM
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్‌ నుంచి స్పెషల్ ట్రైన్స్, పూర్తి వివరాలివే Fri, May 10, 2024, 09:04 PM
'జేబులో రూ.150తో హైదరాబాద్ వచ్చా'.. పొలిటికల్ జర్నీపై సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Fri, May 10, 2024, 08:59 PM
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు Fri, May 10, 2024, 08:55 PM