'జేబులో రూ.150తో హైదరాబాద్ వచ్చా'.. పొలిటికల్ జర్నీపై సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

byసూర్య | Fri, May 10, 2024, 08:59 PM

ఎనుమల రేవంత్ రెడ్డి. తెలంగాణ రాజకీయాల్లో చెరగేని ముద్రవేసిన నేత. ఉమ్మడి మహబూబ్‍నగర్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిన రేవంత్.. ఎలాంటి పొలిటికల్ బ్యాగ్రౌండ్ లేకుండానే అత్యున్నత స్థాయికి ఎదిగాడు. జెడ్పీటీసీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన.. అతి తక్కువ కాలంలోనే తనకున్న రాజకీయ చతురతతో సీఎం స్థాయికి చేరుకున్నాడు. తాజాగా.. తన పొలిటికల్ జర్నీపై రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన రేవంత్ కేవలం జేబులో రూ. 150తో హైదరాబాద్ వచ్చానని అన్నారు.


తాను ముఖ్యమంత్రి అవుతానని కలలో కూడా అనుకోలేదని చెప్పారు. జెడ్పీటీసీగా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా, ఆ తర్వాత రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఇప్పుడు సీఎంగా మీ ముందు ఉన్నానని చెప్పారు. ఇదంతా ప్రజల ఆశీర్వాదమేనని చెప్పుకొచ్చారు. తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా తన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని రేవంత్ వ్యాఖ్యనించారు. తెలంగాణ అభివృద్దే ధేయ్యంగా వందేళ్ల ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. అతి తక్కువ కాలంలోనే కేసీఆర్ దగ్గర కుర్చీ లాక్కున్నానని.. ఇక కేసీఆర్ వద్ద లాక్కోవడానికి కూడా ఏం లేదని అన్నారు.


రాష్ట్రాభివృద్ధి కోసం పోటీ పడితే కేసీఆర్‌ను స్వాగతిస్తానని చెప్పారు. నిర్దిష్టమైన ప్రణాళికతో పనిచేస్తానన్న రేవంత్.. కాంగ్రెస్‌లో తనకు ఎవరూ ప్రత్యర్థులు లేరని అన్నారు. అందరూ తనకు సహచరులే అని వ్యాఖ్యనించారు. ముఖ్యమంత్రిగా నాకు అందరూ గౌరవం ఇస్తున్నారని.. తాను తెలంగాణ కాంగ్రెస్‌లో పెద్దోడ్ని కాబట్టి తాను కూడా ఎవరినీ బాధపెట్టేలా మాట్లాడనని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం వెనుక హరీష్ రావు కుట్ర ఉందని రేవంత్ అనుమానం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో కేసీఆర్ స్థానాన్ని హరీష్ రావు లాక్కున్నారని విమర్శించారు. కేసీఆర్ రాకపోవడం వల్ల హరీష్ రావు ఒక్కడికే లాభం జరుగుతుందని అన్నారు, తానేతే కేసీఆర్ అసెంబ్లీకి రావాలనే కోరుకుంటున్నట్లు వెల్లడించారు.


Latest News
 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైంది,,,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Mon, May 20, 2024, 10:00 PM
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు Mon, May 20, 2024, 09:53 PM
తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ జిల్లాల్లోనే, వాతావరణశాఖ హెచ్చరికలు Mon, May 20, 2024, 09:01 PM
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం Mon, May 20, 2024, 08:58 PM
కుమార్తెను చంపిన తల్లిదండ్రులు.. తల్లికి దూరమైన 13 నెలల పసికందు Mon, May 20, 2024, 08:54 PM