తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

byసూర్య | Fri, May 10, 2024, 08:55 PM

తెలంగాణ వాతావరణంలో అనుహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మెున్నటి వరకు ఎండలు దంచికొట్టగా.. తాజాగా వాతావరణం చల్లబడింది. గత రెండ్రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. నేడు కూడా తెలంగాణలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతవారణశాఖ అధికారులు తెలిపారు. తమిళనాడులో ద్రోణి ఏర్పడి అది తెలుగు రాష్ట్రాలపై చాలా బలంగా విస్తరించిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.


దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై స్పష్టం ఉందని.. రాష్ట్రంలో వర్షాలు కరుస్తాయని తెలిపారు. ప్రస్తుతం వేడి గాలులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతుండగా.. తమిళనాడులోని ద్రోణి ప్రభావంతో రెండు రోజులు నేడు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని చెప్పింది. నేడు యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, అసిఫాబాద్, మంచిర్యాల, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.


Latest News
 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైంది,,,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Mon, May 20, 2024, 10:00 PM
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు Mon, May 20, 2024, 09:53 PM
తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ జిల్లాల్లోనే, వాతావరణశాఖ హెచ్చరికలు Mon, May 20, 2024, 09:01 PM
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం Mon, May 20, 2024, 08:58 PM
కుమార్తెను చంపిన తల్లిదండ్రులు.. తల్లికి దూరమైన 13 నెలల పసికందు Mon, May 20, 2024, 08:54 PM