అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు

byసూర్య | Mon, May 20, 2024, 09:53 PM

అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఇదిలావుంటే సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ ఈరోజు నిర్ణయించింది. ఈ అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. రైతులు తాము పండించిన పంటను అమ్మకానికి సిద్ధపడి బోనస్ కోసం ఎదురు చూస్తున్నారని... కానీ వారందరి ఆశలు అడియాసలు చేస్తూ కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని.. అది కూడా వచ్చే సీజన్ నుంచి ఇస్తామని ప్రకటించడం అత్యంత బాధాకరమన్నారు. మన రాష్ట్రంలో దాదాపు 90 శాతం దొడ్డు రకం వడ్లనే పండిస్తారని... 10 శాతం పండే సన్న వడ్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంటుందని తెలిపారు.


సన్న వడ్లకు మద్దతు ధర కంటే చాలా అధికంగా మార్కెట్‌లో ధర వస్తుందన్నారు. కానీ, దొడ్డు రకం బియ్యానికే గిట్టుబాటు ధర రాదని పేర్కొన్నారు. అందుకే బోనస్ ఇవ్వాల్సింది దొడ్డు రకం వడ్లకే అన్నారు. కానీ సన్నరకం వడ్లకు... అదీ వచ్చే సీజన్ నుంచి ఇస్తామని చెప్పడం రైతులను దగా చేయడమే అన్నారు. కేబినెట్ తర్వాత మంత్రులు చేసిన ప్రకటనతో... కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల సంక్షేమంపై, వ్యవసాయాభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్నారు. ఈ సీజన్ నుంచే అన్ని రకాల వడ్లకు రూ.500 చొప్పున బోనస్ చెల్లించాలని రైతుల పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.


కాంగ్రెస్ బోనస్‌ పెద్ద బోగస్ అని విమర్శించారు. నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చి, తాము ఆ మాట అనలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు వడ్లకు బోనస్ ఇచ్చే విషయంలో పచ్చి అబద్ధాలతో రైతులను మోసం చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి రావాలనే దురుద్దేశంతో ఇచ్చినవే తప్ప రైతుల మేలు కోసం చేసే కార్యక్రమాలు కావని తేలిపోయిందన్నారు. అలాగే రైతు భరోసా రూ.15 వేలు, కూలీలకు రూ.12వేల చొప్పున ఆర్థిక సాయం అమలు చేయడం లేదన్నారు.



Latest News
 

ఏడాది పాలనలో ఏం చేశారని విజయోత్సవాలు : డీకే అరుణ Mon, Dec 02, 2024, 12:26 PM
స్వల్పంగా తగ్గిన పత్తి, మిర్చి ధరలు Mon, Dec 02, 2024, 12:22 PM
వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య Mon, Dec 02, 2024, 12:10 PM
సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో భక్తులు రద్దీ Mon, Dec 02, 2024, 11:19 AM
కురుమూర్తి బ్రహ్మోత్సవాలలో భక్తుల రద్దీ Mon, Dec 02, 2024, 11:15 AM