శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్

byసూర్య | Sat, Sep 07, 2024, 09:37 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో విలన్ క్యారెక్టర్ పోషించిన వినాయకన్‌ అనే మళయాళ నటుడిని శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే వినాయకన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌పై వినాయకన్ చేయి చేసుకున్నట్టుగా ఫిర్యాదు చేయటంతో.. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో కానిస్టేబుల్ మీద దాడి చేసినట్లు ఫిర్యాదు చేయటంతో.. వినాయకన్‌ను అదుపులోకి తీసుకున్న సీఐఎస్‌ఎఫ్ పోలీసులు.. ఆర్జీఐ పోలీసులకు అప్పగించారు. వినాయకన్ అదుపులోకి తీసుకున్న ఆర్జీఐ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.


కొచ్చిలో సినిమా షూటింగ్ ముగించుకుని వినాయకన్ గోవా వెళ్తున్నట్టు సమాచారం. అయితే.. హైదరాబాద్‌ ఎయిర్ పోర్టులో కనెక్టింగ్ ఫ్లైట్ కోసం వినాయకన్ ఎదురుచూస్తున్న సమయంలోనే.. ఈ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే.. వినాయకన్‌ మాత్రం మరోలా స్పందిస్తున్నారు. తానుం ఏ తప్పూ చేయలేదని చెప్తున్నాడు. ఎయిర్‌పోర్టు అధికారులే తనను గదిలోకి తీసుకెళ్లి వేధించారని... కావాలంటే సీసీటీవీ ఫుటేజీ కూడా చెక్‌ చేసుకోవాలంటూ చెప్తున్నట్టు సమాచారం. అసలు తనను ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని ఓ మీడియాతో వాపోవటం గమనార్హం.


రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో వర్మ పాత్రతో వినాయకన్ పాపులర్ అయ్యారు. ప్రస్తుతానికి వినాయకన్ గోవాలో సెటిల్ అయినట్టు తెలుస్తోంది. అయితే.. సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే వినాయకన్‌.. గతేడాది అక్టోబర్ 23న కూడా దురుసు ప్రవర్తనతో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.


అయితే... వినాయకన్‌ కు వివాదాలు కొత్తేం కాదు. గతేడాది అక్టోబర్ నెలలో కూడా కేరళ పోలీసులు వినాయకన్‌ను అరెస్టు చేశారు. ఎర్నాకుళం టౌన్‌ నార్త్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మద్యం మత్తులో గొడవకు దిగటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వినాయకన్‌ తమను ఇబ్బంది పెడుతున్నాడంటూ.. అపార్ట్‌మెంట్‌ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకన్న పోలీసులు.. అపార్ట్ మెంటుకు చేరుకుని వినాయకన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు కూడా వినాయకన్ మద్యం మత్తులో ఉండటం గమనార్హం. అయితే.. అరెస్ట్ సమయంలో వినాయకన్‌ కోపంతో ఊగిపోయాడు. తాము మర్యాదగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో పోలీసులు.. వినాయకన్‌పై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. వినాయకన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయడం అదే మొదలిసారి కాదు. గతంలోనూ ఓ మోడల్‌ను వేధించాడన్న ఆరోపణలతో వినాయకన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.



Latest News
 

తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్.. పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ Mon, Sep 16, 2024, 10:09 PM
రాజీవ్ గాంధీ లేకపోతే సిద్ధిపేట రైల్వే స్టేషన్‌లో ఛాయ్, సమోస అమ్ముకునేటోనివి: రేవంత్ రెడ్డి Mon, Sep 16, 2024, 10:05 PM
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఆవిష్కరించాలన్న ఈటల Mon, Sep 16, 2024, 09:58 PM
హైదరాబాద్‌లో లక్ష గణపతి విగ్రహాల నిమజ్జనం.. ఆమ్రపాలి కీలక సూచనలు Mon, Sep 16, 2024, 09:49 PM
కళ్లుచెదిరిపోయేలా ఖైరతాబాద్ గణేషుడి ఆదాయం. Mon, Sep 16, 2024, 09:45 PM