విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి

byసూర్య | Sat, Sep 07, 2024, 09:31 PM

కొందరు విద్యుత్ అధికారులు నిజాయతీగానే ఉన్నా.. మరికొందరు మాత్రం కాసులకు కక్కుర్తి పడుతుంటారు. వినియోగదారులకు ఏదైనా అవసరం పడితే డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏ చిన్న సమస్య వచ్చినా.. ప్రజలను డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. వ్యవసాయ పొలాల వద్ద మీటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు చెడిపోయినప్పుడు అయితే వేలల్లో డిమాండ్ చేసి రైతుల నుంచి లంచం తీసుకుంటారు. చాలా కాలంగా ఇది సాగుతున్నా.. ఉన్నతాధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ అక్రమ వసూళ్లపై చాలా కాలంగా ఫిర్యాదులు అందుతున్నాయి.


ఈ నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. లంచం అడిగే అధికారుల పట్ల కఠినంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. విద్యుత్‌ సిబ్బందిగానీ, అధికారులుగానీ ఏదైనా పనికి డబ్బులు డిమాండ్ చేస్తే. తమకు ఫోన్‌ ద్వారా తెలియజేయాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ ప్రజలకు సూచించారు. వినియోగదారులు తమ పనుల కోసం లంచం అడిగిన సిబ్బందిపై 040-23454884 లేదా 7680901912 నంబరుకు ఫోన్‌ ద్వారా కంఫ్లైంట్ చేయవచ్చునని అన్నారు. వినియోగదారుల సమస్యలు, ఫిర్యాదులను నేరుగా తెలుసుకుని వేగంగా పరిష్కరించడానికి ఈ ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.


కొత్త విద్యుత్ కనెక్షన్ల మంజూరు, కేటగిరీ, సర్వీస్ వినియోగదారుల పేరు మార్పు, కరెంటు బిల్లుల్లో ఏవైనా లోపాలు తదితర సేవలు పొందేందుకు సంస్థ వెబ్‌సైట్ మార్పులుు చేసుకోవచ్చునని చెప్పారు. మొబైల్‌ యాప్‌ల ద్వారా అవకాశం కల్పించినట్లు సీఎండీ ఫరూఖీ వెల్లడించారు. వినియోగదారులకు ఇబ్బందులు కలిగిస్తూ విధుల పట్ల ఎవరైనా ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తే.. వారిపై కఠిన చర్యలు తప్పవని సీఎండీ హెచ్చరించారు. అలాంటి చర్యలకు పాల్పడితే సస్పెండ్ చేస్తామన్నారు.


Latest News
 

తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్.. పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ Mon, Sep 16, 2024, 10:09 PM
రాజీవ్ గాంధీ లేకపోతే సిద్ధిపేట రైల్వే స్టేషన్‌లో ఛాయ్, సమోస అమ్ముకునేటోనివి: రేవంత్ రెడ్డి Mon, Sep 16, 2024, 10:05 PM
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఆవిష్కరించాలన్న ఈటల Mon, Sep 16, 2024, 09:58 PM
హైదరాబాద్‌లో లక్ష గణపతి విగ్రహాల నిమజ్జనం.. ఆమ్రపాలి కీలక సూచనలు Mon, Sep 16, 2024, 09:49 PM
కళ్లుచెదిరిపోయేలా ఖైరతాబాద్ గణేషుడి ఆదాయం. Mon, Sep 16, 2024, 09:45 PM