తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్.. పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్

byసూర్య | Mon, Sep 16, 2024, 10:09 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలు, వరదలతో పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. భారీ వర్షాల నుండి ఏపీ, తెలంగాణ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నేటి వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని చెప్పారు. వీటి ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.


గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశముందని తెలిపారు. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. అయితే భారీ వర్షాలకు ఛాన్స్ లేదని అన్నారు. ఇక హైదరాబాద్‌లో ఆదివారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అప్పటి వరకు ఎండ కాయగా.. ఉన్నట్లుండి వాతావరణం మారిపోయి వర్షం కురిసింది. పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఎస్‌ఆర్ నగర్, బేగంపేట, బంజరాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం కారణంగా నగరంలోని నిమజ్జనాలకు కాస్త ఆటంకం కలిగింది.


ఇటీవల తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు ఈ ఏడాది (2024) వర్షపాత లోటును పూర్తిగా మార్చేశాయి. రాష్ట్రవ్యాప్త సగటును పరిశీలిస్తే జూన్, జులై నెలల్లో వర్షాలు పర్వాలేదనిపించాయి. ఆగస్టులో మాత్రం 3.45 శాతం లోటు నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆగస్టు చివరి వారం నుంచి ప్రారంభిమైన వర్షాలు ఈ నెల మొదటి వారం వరకు కుంభవృష్టి కురవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలంగాణ వర్షాకాలపు సాధారణ వర్షపాతం 738.6 మిల్లీ మీటర్లు.. అయితే ఈ నెల 11 నాటికి 897.6 మి.మీ. వర్షపాతం నమోదైంది.


ఈ నెలలో 11వ తేదీ నాటికే 61 మి.మీ. కురిసిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సాధారణం కన్నా 7 జిల్లాల్లో అత్యధిక శాతం వర్షాలు కురిశాయని వెల్లడించారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, సిద్దిపేట, మహబూబాబాద్, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయన్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. మిగిలిన 24 జిల్లాల్లో అధిక శాతం వర్షాలు కురిశాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.


Latest News
 

గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి.. తండ్రిని కాపాడే ప్రయత్నంలో కూతురు మృతి Wed, Sep 18, 2024, 10:11 PM
21 గ్రామాల మీదుగా,,,,,హైదరాబాద్ సమీపంలో 6 లైన్ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి Wed, Sep 18, 2024, 10:08 PM
బీజేపీ మహిళా ఎంపీ హీరోయిన్ కంగనా రౌనత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ Wed, Sep 18, 2024, 10:07 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. దంచికొట్టనున్న వానలు, నేటి వెదర్ రిపోర్ట్ Wed, Sep 18, 2024, 10:06 PM
నవంబర్ 10 లోగా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే, ప్రభుత్వంపై పోరాటం తప్పదు : కేటీఆర్ Wed, Sep 18, 2024, 10:02 PM