మీ తోపు అందుకే ఇంకా కళ్లముందున్నాడు, లేకపోతేనా.. ఒవైసీ‌కి నవనీత్ కౌర్ కౌంటర్

byసూర్య | Fri, May 10, 2024, 08:52 PM

లోక్ సభ ఎన్నికలకు సమయం మరింత దగ్గర పడుతున్న క్రమంలో ఎంఐఎం, బీజేపీ నేతల మధ్య విమర్శలు తెలంగాణలో దుమారం రేపుతున్నాయి. అందులోనూ.. హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ , అమరావతి ఎంపీ, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ నవనీత్ కౌర్ మధ్య ఘాటైన మాటల యుద్ధం నడుస్తోంది. హైదరాబాద్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలత కు మద్దతుగా మే 9న ఎన్నికల ప్రచారం నిర్వహించిన నవనీత్ కౌర్.. ఒవైసీ సోదరులపై సంచలన కామెంట్లు చేశారు. కాగా.. ఆమె చేసిన వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ కూడా అంతే ఘాటుగా స్పందించారు. అయితే.. ఇప్పుడు అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై మరోసారి నవనీత్ కౌర్ కౌంటర్ ఇచ్చారు.


ఠబడే ఒవైసీ చాలా ఉత్సాహంగా ఓ స్పీచ్‌లో చెప్తున్నాడు.. 'మా ఛోటే తోపు.. నేను అతన్ని కంట్రోల్ చేస్తున్నా' అని.. అలాంటి తోపులను నా ఇంటి ముందు కాపాలాకు పెట్టుకుంటా. అంతేకాదు.. 'ఛోటే' వాళ్ల ఘీంకారమని చెప్తున్నాడు. అలాంటి ఘీంకారించే వాటిని ఇంట్లో కట్టేసి సాధుకుంటాం. గుర్తుపెట్టుకో బడే భాయ్ నేను కూడా ఓ మాజీ సైనికుడి కుమార్తెను. చూస్తా నేను కూడా ఈ కోడి, కోడి పిల్లలు ఎన్ని రోజు భయపెడతాయో. అంతేకాదు.. 'నేను ఛోటేను సంబాలిస్తున్నా, సముదాయిస్తున్నా' అని బడే చెప్తున్నాడు. అలా సముదాయించి పెట్టినవు కాబట్టే ఇంకా నీ కళ్ల ముందు తిరుగుతున్నాడు. లేకపోతేనా.. గల్లీ గల్లీలో రామభక్తులు, నరేంద్ర మోదీ సింహాలు తిరుగుతున్నాయి జాగ్రత్త. అలా నచ్చజెప్పినవ్ కాబట్టి.. కళ్ల ముందు కనిపిస్తున్నాడు. నేను కూడా అతి త్వరలో హైదరాబాద్ వస్తా.. ఎవడు ఆపుతాడో చూస్తా." అంటూ మహారాష్ట్రాలోని తన ఇంటి నుంచి నవనీత్ కౌర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.


హైదరాబాద్ వస్తా.. ఎవడు ఆపుతాడో చూస్తా.. ఒవైసీకి నవనీత్ కౌర్ స్ట్రాంగ్ కౌంటర్


అయితే.. అంతకు ముందు హైదరాబాద్ యువమోర్చ సమావేశంలో నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. "ఎంఐఎం నేతలకు 15 నిమిషాలు అవసరమైతే.. అదే పోలీసులు పక్కకు తప్పుకుంటే తమకు కేవలం 15 సెకన్లు చాలు ఛోటే. తాము తలుచుకుంటే ఎక్కడికిపోతారో తెలియదు." అంటూ ఒవైసీకి నవనీత్ కౌర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందుకు గానూ.. నవనీత్ కౌర్‌పై షాద్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.


కాగా.. నవనీత్ చేసిన వ్యాఖ్యలపై అసదుద్దీన్ కూడా చాలా సీరియస్‌గా స్పందించారు. ఛోటేను ఆపటం ఎవరి తరం కాదని.. అతన్ని చాలా కష్టం మీద కంట్రోల్ చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. అతను ఛోటే కాదని.. తోపు అంటూ చెప్పుకొచ్చారు. ఆ ఛోటే కేవలం అసదుద్దీన్ ఒవైసీ మాట మాత్రమే వింటాడని.. అతన్ని ఆపడం మీ తరం కాదు కదా, ఎవరి అయ్య తరం కూడా కాదంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు. "15 సెకన్లు చాలట. మేమేమైనా కోడిపిల్లలమా? నువ్వు మొదలుపెట్టి చూడు" అంటూ నవనీత్ కౌర్‌కు అసదుద్దీన్ సవాల్ విసిరారు.


Latest News
 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైంది,,,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Mon, May 20, 2024, 10:00 PM
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు Mon, May 20, 2024, 09:53 PM
తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ జిల్లాల్లోనే, వాతావరణశాఖ హెచ్చరికలు Mon, May 20, 2024, 09:01 PM
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం Mon, May 20, 2024, 08:58 PM
కుమార్తెను చంపిన తల్లిదండ్రులు.. తల్లికి దూరమైన 13 నెలల పసికందు Mon, May 20, 2024, 08:54 PM